Cifra Club

Massa Massa

Vishal Mishra

Aún no tenemos los acordes de esta canción.

మస్సా మస్సా మస్సా
చిక్ చిక్ చకతికి మస్సా

ఉలికిపడి ఊగాలా
ఉలకైనా నేను రాకేస్తుంటే
అదిరిపడి ఆగాలా
పిడుగైనా నేనడుగేస్తే

కొండరాల్లే నాపై
కండరాలైతే
నిప్పువానే నాలో
నెత్తురైతే

భూగోళాన్నే ఆపే
సత్తా నా సొత్తే
విశ్వాన్ని పేల్చే
విస్ఫులింగానై

మస్సా మస్సా మస్సా
నాకు నేనే చాల్లోయ్
చిక్ చిక్ చకతికి మస్సా
నా వెన్నే నా దన్నవ్వాలోయ్
మస్సా మస్సా మస్సా
నా దన్నే నా రొమ్మవ్వాలోయ్
చిక్ చిక్ చకతికి మస్సా
రాటు దేలాలోయ్

ఓహ్

నిలువెల్లా నాపై
చెమటే మండుతుంది
నాకై ముడిచమురై
సెగ వల్లా ఆపై
మనసే బుస కొడుతుందోయే
బడబాగ్నై, ఓహ్

ఆవేశానికి అరుపు దేనికి
చరుపు మాత్రమే చాలుగా
ఆక్రోశానికి అణచివేతకి
చివరి మలుపుకి చూపగా

ఒక్కో పట్టు
ఒక్కొక్క మెట్టుగా
ఎక్కేటట్టు
నా పట్టు పట్టానా

యే కష్టాలైనా
నా పాదాల కింద
నేనొక తిట్టు
ఒక్కొక్క బొట్టులాగా ఎదిగేటట్టు
నేనొట్టు పెట్టానా
నాకు యే రోజున
నీరాజనం పట్టేదారుందా
నా కట్టే కాలేలోగా

మస్సా మస్సా మస్సా
చిక్ చిక్ చకతికి మస్సా
మస్సా మస్సా మస్సా
నా దన్నే నా రొమ్మవ్వాలోయ్
చిక్ చిక్ చకతికి మస్సా
రాటు దేలాలోయ్
మస్సా మస్సా మస్సా
నా దన్నే నా రొమ్మవ్వాలోయ్
చిక్ చిక్ చకతికి మస్సా
రాటు దేలాలోయ్
పెద్ది పెద్ది పెద్ది

Otros videos de esta canción
    0 visualizaciones

    Afinación de los acordes

    Afinador en línea

    Ops (: Contenido disponible solo en portugués.
    OK